ఇంగ్లండ్ ఆలౌట్.. ఆసీస్ విజయం లాంఛనమే!
యాషెస్ 2వ టెస్ట్ 2వ ఇన్నింగ్స్‌లో ENG 241 పరుగులకే ఆలౌటయ్యింది. 4వ రోజు తొలి సెషన్‌లో స్టోక్స్, జాక్స్ వికెట్ పడకుండా ఆడినా.. 2వ సెషన్‌లో బ్యాటర్లు వెంటవెంటనే వెనుదిరిగారు. దీంతో స్టోక్స్ సేన AUS ముందు 65 పరుగుల లక్ష్యమే ఉంచగలిగింది. ఈ స్కోర్‌ను ఆసీస్ ఓపెనర్లే ఊదేస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. తొలి టెస్ట్ మాదిరి ఇందులోనూ ఆసీస్ విజయం లాంఛనంగా కనిపిస్తోంది!