రూ.10 లక్షలతో సీసీ రోడ్డు పనులు షురూ

రూ.10 లక్షలతో సీసీ రోడ్డు పనులు షురూ

VKB: మోమిన్‌పేట మండలం వెల్చాల్ గ్రామంలో రూ.10 లక్షల ఉపాధి హామీ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను సర్పంచ్ శ్రీనివాస్ ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. దశలవారీగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రమేశ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.