VIDEO: అక్షరాలు దిద్దాలంటే.. రెండు కిలోమీటర్లు నడవాల్సిందే

VIDEO: అక్షరాలు దిద్దాలంటే.. రెండు కిలోమీటర్లు నడవాల్సిందే

ASR: జీకే. వీధి మండలం లక్కవరపుపేట పంచాయతీ పరిధి పోతురాజుగుమ్మల గ్రామంలో పాఠశాల భవనం నిర్మించాలని గిరిజనులు కోరుతున్నారు. 20 మంది విద్యార్థులు ఉన్న గ్రామంలో పాఠశాల లేకపోవడంతో వారు 2 కిలోమీటర్ల దూరంలోని కొయ్యూరు మండల కిండంగి ఎంపీపీ పాఠశాలకు వెళ్లి చదువుకోవాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.