అగ్నివీర్‌కు దరఖాస్తుల ఆహ్వానం
JN: అగ్నిపథ్‌లో భాగంగా భారత సైనిక విభాగంలో అగ్నివీర్‌గా చేరేందుకు పురుష అభ్యర్థుల నుంచి 2027 సంవత్సరానికి గాను దరఖాస్తులను కోరుతున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి కే. కోదండ రాములు తెలిపారు. అలాగే 8వ తరగతి ఆ పైన చదివి ఆసక్తి, అర్హత కలిగిన యువకులు 01.04.2026వ తేదీ లోపు (www.joinindianarmy.nic.in) వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా వారు కోరారు.