'పాఠకులను ఆకట్టుకునే పుస్తకాలు కొనుగోలు చేస్తాం'
W.G: పాలకోడేరు గ్రామంలోని గ్రంథాలయాన్ని బుధవారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ జుత్తిగ నాగరాజు సందర్శించారు. గ్రంధాలయ భవనాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. చదువరులను ఆకర్షించుటకు అవసరమైన పుస్తకాలు కొనుగోలు, చదువరులకు అనుకూల వాతావరణం ఏర్పాటు చేయుటకు కృషి చూస్తున్నట్టు తెలియజేశారు. వారితో పాటు గ్రంథాలయ పాఠకులు, సిబ్బంది పాల్గొన్నారు.