ఏయూ శతాబ్ది ఉత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ
VSP: ఏయూ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల పోస్టర్లను వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్ ఆవిష్కరించారు. కార్యక్రమం ఏయూ పరిపాలనా భవనం వద్ద నిర్వహించగా రెక్టర్, రిజిస్ట్రార్, ప్రిన్సిపాల్స్, డీన్లు పాల్గొన్నారు. ఏప్రిల్ 19న ఆర్ట్స్, కామర్స్, ఐఏఎస్‌ఈ, ఇంటర్నేషనల్ బిజినెస్ విభాగాల సంయుక్తంగా బీచ్ రోడ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఉత్సవాలు జరగనున్నాయి.