రోడ్డు ప్రమాదం.. ఆటో డ్రైవర్‌కు గాయాలు

రోడ్డు ప్రమాదం.. ఆటో డ్రైవర్‌కు గాయాలు

KMM: రఘునాధపాలెం మండలం కోయచలక వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోయచలక స్వాతి మినరల్స్ దగ్గర ట్రాక్టర్, ట్రాలీ ఆటో ఢీకొనడంతో ఆటో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ట్రాక్టర్ ట్రక్కుని వెనుక నుంచి ఆటో ఢీకొట్టడంతో ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. గాయాలపాలైన ఆటో డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం స్థానికులు ఆసుపత్రికి తరలించారు.