రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

SDPT: గజ్వేల్ పరిధిలో ఈ నెల 12న విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని DE ఆర్.భానుప్రకాశ్ ప్రకటించారు. 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లైన్ వర్క్ కారణంగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గజ్వేల్(M) బంగ్లా వెంకటాపుర్, ధర్మారెడ్డిపల్లి, వర్గల్(M) మజీద్ పల్లి, నెంటూర్, రాయపోల్(M) బేగంపేట గ్రామాల్లో సరఫరా నిలిపివేస్తారు.