'రోడ్లపై చెత్త వేస్తే జరిమానా తప్పదు'
AKP: రోడ్లపై చెత్త వేస్తే జరిమానా విధిస్తామని నాతవరం ఎంపీడీవో ఎంఎస్. శ్రీనివాస్ హెచ్చరించారు. శుక్రవారం నాతవరంలో పర్యటించిన ఎంపీడీవో రోడ్లపై చెత్త వేయడాన్ని గమనించారు. ఈ విషయమై స్వయంగా దుకాణదారుల వద్దకు వెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇకపై రోడ్లపై చెత్త వేస్తే చర్యలు తప్పవన్నారు. పంచాయతీని శుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని కోరారు.