VIDEO: ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే
ప్రకాశం: కనిగిరిలోని 9వ వార్డులో ఆదివారం ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానికులతో సమావేశమై వారి నుంచి వచ్చిన వినతులను స్వీకరించి, వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.