ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన మార్కెట్ కమిటీ

CTR: వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతనంగా నియమితులైన పాలకవర్గం, సోమవారం ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్‌ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపింది. ఛైర్మన్ వైయ్యాసి ఝాన్సీ రాణి, వైస్ ఛైర్మన్ పి.అనురాధ, సభ్యులు ఎమ్మెల్యేకు శాలువ, పుష్పగుచ్ఛాలు అందజేశారు. కమిటీ పాలకవర్గంలో అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.