సమాచార హక్కు చట్టంపై అవగాహన

VZM: పట్టణంలోని రైతు శిక్షణ కార్యాలయంలో సమాచార హక్కు చట్టంపై సిబ్బందికి సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రకృతి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీపీఎం ఆనంద్ సమాచార హక్కు చట్టం ప్రాముఖ్యతను, బాధ్యతలను సిబ్బందికి వివరించారు. దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా డిస్పోజ్ చేయాలని, లేకుంటే పెనాల్టీ చెల్లించవలసి వస్తుందన్నారు.