తలలో పేలు ఉన్నాయా?.. ఇలా చేయండి
తలలో పేలు సమస్యను తొలగించడానికి ఇలా చేయండి. రాత్రి పడుకునే ముందు జుట్టుకు వేప నూనెను పెట్టుకోండి. ఆ తర్వాత తలను టోపి, గుడ్డతో కప్పండి. ఉదయం షాంపూతో స్నానం చేయండి. ఇలా 1,2 సార్లు వేప నూనె అప్లై చేసినా వెంటనే ఫలితం కనిపిస్తుంది. పేలు సమస్య తగ్గుముఖం పడుతుంది. వేప నూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలుంటాయి.