యూరియా డీలర్లపై ఇంటిలిజెన్స్ నిఘా
గుంటూరు జిల్లాలో రైతులకు కావాల్సిన ఎరువులన్నీ రైతు సేవా కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ద్వారా మార్క్ ఫెడ్ అందజేస్తుందని జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరరావు సోమవారం తెలిపారు. ఖరీఫ్‌కి సంబంధించి సెప్టెంబర్ మాసం వరకు 24,012 మెట్రిక్ టన్నులు యూరియా అవసరం ఉందని, డీలర్లపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టామని తెలిపారు.