VIDEO: ప్రభుత్వ డైట్ కళాశాలలో ఘనంగా ఉగాది వేడుకలు
NLR: ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడు ప్రభుత్వ డైట్ కళాశాలలో బుధవారం తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. పరాభవ నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి తెలుగు వారికి నూతన సంవత్సరం అని ఇంఛార్జి ప్రిన్సిపల్ అక్కిరెడ్డి అన్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది, ఛాత్రోపాధ్యాయులు అందరూ కలిసి ఉగాది పచ్చడి తయారు చేశారు.