VIDEO: వర్షానికి కూలిన భారీ చెట్టు
ప్రకాశం: అల్పపీడనం ప్రభావంతో కడపలో గత రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షానికి కో-ఆపరేటివ్ కాలనీలో ఓ భారీ చెట్టు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ వృక్షం ట్రాన్స్‌ఫార్మర్‌పై పడటంతో విద్యుత్ తీగలు తెగిపోయాయి. ముందస్తుగా విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. స్పందించిన మున్సిపల్ సిబ్బంది కూలిన చెట్టును వెంటనే తొలగించారు.