VIDEO: ఘనంగా ధ్వజ స్తంభం ప్రతిష్టాపన

KDP: ముద్దనూరు మండలం రాజుగురువాయిపల్లెలో శ్రీ గౌరీ శంకర దేవస్థానంలో నూతన ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఉదయం నుంచే ఆలయంలో గణపతి పూజ, ప్రత్యేక హోమం, పూజలు నిర్వహించారు. వేదపండితుల వేద మంత్రోచ్చరణల నడుమ న్యారేపతో చేసిన ధ్వజ స్తంభాన్ని ప్రతిష్టింపచేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.