పోలింగ్ విధులు.. హెడ్ కానిస్టేబుల్‌కు గుండెపోటు
సూర్యాపేట: జిల్లాలో పంచాయతీ ఎన్నికలు పోలింగ్ కొనసాగుతోంది. అయితే ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుకు గురయ్యాడు. దీంతో వెంటనే సహాచర పోలీసులు సీపీఆర్ చేసి ప్రాథమిక చికిత్స అందించారు. హెడ్ కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉండడంతో సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.