'తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయం అందజేశాం'
E.G: మొంథా తుఫాన్ వల్ల నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ప్రత్యేక ఆర్థిక సహాయంగా రూ.23.26 లక్షల పంపిణీ చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఆర్థిక సాయాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు సమక్షంలో ఆయా లబ్ధిదారులకు మండల స్థాయిలో అందజేస్తున్నట్లు ఆమె వెల్లడించారు.