'భవిత కేంద్రాలతో దివ్యాంగుల మానసిక అభివృద్ధి'
KNR: భవిత కేంద్రాల్లో ప్రత్యేక విద్యా విధానం ద్వారా దివ్యాంగ పిల్లలు మానసికంగా అభివృద్ధి చెందుతారని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మించిన భవిత కేంద్రాన్ని (ప్రత్యేక అవసరాలు గల పిల్లల పాఠశాల) జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు.