సదాశివపేటలో క్షుద్ర పూజల కలకలం

సదాశివపేటలో క్షుద్ర పూజల కలకలం

SRD: సదాశివపేట పట్టణంలో క్షుద్ర పూజల కలకలం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బస్టాండ్ సమీపంలోని బీరువా కార్ఖానా సమీపంలో మంగళవారం అర్ధరాత్రి క్షుద్ర పూజలు నిర్వహించారు. ఈ పూజల కోసం అయోధ్య నుంచి ఓ స్వామి వచ్చినట్లు సమాచారం. శబ్దాలు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి క్షుద్ర పూజలను అడ్డుకున్నారు.