మునగచెర్ల వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడింది ఇతనే.!

మునగచెర్ల వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడింది ఇతనే.!

NTR: నందిగామ మండలంలోని మునగచర్ల క్రాస్‌ రోడ్డు వద్ద బైక్‌ను కారు ఢీకొనడంతో ట్రాక్టర్ మెకానిక్ చలమల శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని 108లో నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించి, అక్కడి నుంచి అత్యవసర చికిత్స కోసం విజయవాడకు రిఫర్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.