వేసవి జాగ్రత్తలు తప్పనిసరి: డాక్టర్ శ్రీకాంత్
MLG: వెంకటాపురం మండల కేంద్రంలో వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పీహెచ్ సీ వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్ సూచించారు. బయటకు వెళ్లేటప్పుడు తలకు టోపీ లేదా రుమాల్ ధరించాలని, పనులు ముగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. పీహెచ్సీ, ఆరోగ్య ఉప కేంద్రాలు, ఆశా వర్కర్ల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.