'పార్టీ కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా పని చేయాలి'
KMR: కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సూచించారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు డివిజన్ల పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, మంత్రి జూపల్లి కృష్ణారావు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.