'సాగర్ కాల్వ కట్టపై 'తారు' వేయండి'
SRPT: నడిగూడెం మండలం రామాపురం శివారులోని నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కట్టపై తారు రోడ్డు నిర్మించాలని వాహనదారులు కోరుతున్నారు. రామాపురం, చాకిరాల, తదితర గ్రామాల ప్రజలు ఈ మార్గం గుండానే ప్రయాణిస్తుంటారు. ఇక్కడ రహదారి సౌకర్యం కల్పిస్తే 65వ నంబర్ జాతీయ రహదారికి చేరుకోవడం సులభతరమవుతుందని, ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుందని స్థానికులు పేర్కొంటున్నారు.