'అంబేద్కర్ అంటారానితనం నిర్మూలనకు కృషి'
KMR: ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో మంగళవారం అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి ఛైర్మన్ శ్రీకాంత్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ భారత రాజ్యాంగానికి నిర్మాతగా ఉన్నారని తెలిపారు. అంటరానితనం నిర్మూలనకు కృషి చేశారని కొనియాడారు. అన్ని వర్గాల ప్రజలు ఐక్యమత్యంతో ఉండాలన్నారు.