లైసెన్సు ఉంటేనే ఇక ప్రచారం!
AP: నగరాలు, పట్టణాల్లో అక్రమంగా ఏర్పాటు చేస్తున్న హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలపై హైకోర్టు ఇటీవల అభ్యంతరం తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు అడ్వర్టైజ్‌మెంట్ పాలసీలో కొత్త మార్గదర్శకాలను త్వరలో జారీ చేయనుంది. దీంతో ఇకపై లైసెన్సు ఉన్న ఏజెన్సీల ఆధ్వర్యంలోనే హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు పెట్టుకునేందుకు అనుమతి ఉంటుంది.