'తొలి పుస్తకానికే దక్కిన పురస్కారం'
నల్గొండకు చెందిన ముగ్గురు రచయితలు తమ రచనతో తొలి పుస్తకానికే పురస్కారాన్ని అందుకున్నారు. మూడు పురస్కారాల్లో ఒకటి ఏపీలోని నెల్లూరు నుంచి, మిగితా రెండు తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి వారు దక్కించుకున్నారు. నల్గొండకు చెందిన కంచనపల్లి రవికాంత్, నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడేనికి చెందిన బండారు శంకర్, మిర్యాలగూడకు చెందిన వడ్డేపల్లి వెంకటేష్‌లకు తొలి ప్రచురణకే పురస్కారాలు దక్కడంపై హర్షం వ్యక్తంచేశారు.