గణేష్ నిమజ్జనం వేడుకలో జిల్లా ఎస్పీ

TPT: తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహించారు. ఇవాళ నిమజ్జనం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని SP హర్షవర్ధన్ రాజు అన్నారు. సాంప్రదాయ నృత్య కళలతో పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది పాల్గొని వినాయక సాగరంలో నిమజ్జనం చేశారు. అనంతరం స్వామివారి లడ్డూ వేలం పాటలో క్రైం SI ప్రకాష్ కుమార్ 21వేలకు పాడుకున్నారు.