రావిపాడులో ఈతకు వెళ్లి యువకుడు మృతి

రావిపాడులో ఈతకు వెళ్లి యువకుడు మృతి

GNTR: పెదనందిపాడు మండలం గొరిజాను గుంటపాలెం గ్రామానికి చెందిన కాండ్రు నితిన్ బుధవారం రావిపాడు గ్రామ సమీపంలో వరగాని వద్ద కాలువలో ఈతకు వెళ్లి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. యువకుడు ఉదయం 11 గంటలకు కాలువలో దిగాడు. ఈత రాకపోవడంతో మృతి చెందాడు. అతను పెదనందిపాడులో డిగ్రీ ఫైనల్ ఇయర్ చుదుతున్నాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.