VIDEO: ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి
SKLM: నరసన్నపేట మండలం రెల్లివలసలో విద్యుత్ స్తంభాలు మారుస్తుండగా జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలో గురువారం సాయంత్రం ట్రాక్టర్ సహాయంతో స్తంభాలు వేస్తున్న సమయంలో ట్రాక్టర్ బోల్తాపడడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో నడగాంకు చెందిన బాణాల రాము (48) అక్కడికక్కడే మృతిచెందగా, జోగి రాంబాబుకు గాయాలయ్యాయి.