అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని వినతి
MNCL: బెల్లంపల్లి పట్టణంలో రోడ్లు, డ్రైనేజీలను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మున్సిపల్ మేనేజర్ మజహర్‌కు శనివారం వినతిపత్రం అందజేశారు. రాజారావు ఆసుపత్రి లైన్, థియేటర్ రోడ్డు, ఆంధ్ర బ్యాంక్ నుంచి SBI వరకు నాలాలను మూసివేసి వ్యాపారాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.