మెంటాడ మార్పుపై ప్రతిపాదన లేదు: మంత్రి
VZM: మెంటాడ మండలాన్ని మన్యం జిల్లాలో చేర్చాలనే అంశంపై తాను ఎటువంటి ప్రతిపాదన చేయలేదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. జడ్పీ సమావేశంలో ZPTC సన్యాసినాయుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. పత్రికల్లో వచ్చిన కథనాలు చూసి ఆందోళన చేపడుతున్నారన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం ఇతర జిల్లాల నుంచి మాత్రమే ప్రతిపాదనలు వచ్చినట్లు పేర్కొన్నారు.