మున్సిపాలిటీకి నూతన ప్రింటర్లు అందజేత

మున్సిపాలిటీకి నూతన ప్రింటర్లు అందజేత

GDWL: గద్వాల మున్సిపల్ కార్యాలయంలో సేవలను వేగవంతం చేసేందుకు మున్సిపల్ ఛైర్ పర్సన్ తుమ్మల జయలక్ష్మి సోమవారం నూతన ప్రింటర్లను అందజేశారు. ప్రజా అవసరాల దృష్ట్యా బ్లాక్ అండ్ వైట్, కలర్ ప్రింటర్లను సిబ్బందికి అందజేస్తూ, సాంకేతిక వసతులతో పనితీరు మెరుగుపడుతుందని ఆమె పేర్కొన్నారు. సర్టిఫికేట్లు, ఇతర పత్రాల జారీలో జాప్యం నివారించేందుకే ఈ చొరవ తీసుకున్నట్లు చెప్పారు.