రోడ్డు ప్రమాదంలో 15 గొర్రెలు మృతి
GDWL: గట్టు మండలం బలిగేర చెకోపోస్ట్ సమీపంలో కర్ణాటక రాష్ట్ర రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. గట్టుకు చెందిన కుర్వ ఎల్లప్పకు చెందిన గొర్రెలను తరలిస్తున్న ఆటోను వేరే వాహనం బలంగా ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆటోలోని ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడగా, దాదాపు 15గొర్రెలు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.