VIDEO: సోమేశ్వర ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
NLR: బోగోలు మండలం సోమేశ్వరపురం గ్రామంలోని శ్రీ కామాక్షి తాయి సమేత సోమేశ్వర స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఇవాళ సందర్శించారు. ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని, కావలి నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. అనంతరం ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులు, గ్రామస్తులతో చర్చించి పలు సూచనలు చేశారు.