జిల్లాలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
PPM: గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటున్నామని జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం 77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్బంగా జేసీ విదార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. హక్కులతో పాటు బాధ్యతలు తెలుసుకోవాలని గుర్తు చేశారు.