రేపు బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన

జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలోని MPDO కార్యాలయం ఎదుట రేపు (సోమవారం) ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలోకి జనగామ ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర్ రెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు.