'రోడ్లపై విచ్చలవిడిగా ఆవులు తిరిగితే జరిమానా'
PDPL: పెద్దపల్లి పట్టణ రోడ్లపై ఆవులు విచ్చలవిడిగా తిరుగుతూ ప్రజలకు, వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నందున యజమానులు వెంటనే వాటిని ఇంటికి తీసుకువెళ్లి కట్టేయాలని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ సూచించారు. పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు నవంబర్ 1, 2025 నుంచి రోడ్లపై తిరిగే ఆవుల యజమానులకు రూ.10,000 జరిమానా విధించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.