మట్టి గణపతులను పంపిణీ చేసిన ఎంపీ

HYD: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ కోరారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని కాప్రాలో మేడ్చల్ జిల్లా బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి రామ్ ప్రదీప్ మునుగంటి ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఈటెల రాజేందర్ హాజరై గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు.