రిపోర్టర్ కుటుంబానికి రూ.2 లక్షల చెక్ అందజేత
CTR: కార్వేటి నగరం మండలం ఆర్కేవీబీ పేట గ్రామానికి చెందిన రిపోర్టర్ సాంబశివ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ సందర్భంగా అదే గ్రామానికి అయ్యప్ప, వారి కుటుంబ సభ్యులు, మిత్రులు కలిసి రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని సాంబశివ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్య క్రమంలో గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.