ఆత్మ రక్షణ శిక్షణకు 491 పాఠశాలల ఎంపిక

ఆత్మ రక్షణ శిక్షణకు 491 పాఠశాలల ఎంపిక

WGL: ఈ విద్యాసంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో రాణి లక్ష్మిబాయి ప్రశిక్షన్ పేరిట బాలికలకు ఆత్మ రక్షణ శిక్షణ కార్యక్రమం అమలు కోసం 491 పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిల్లో 21 ప్రాథమికోన్నత, 470 ZPHS, KGBV, ఆదర్శ ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఒక్కో పాఠశాలకు 3నెలలకు రూ.15 వేలు నిధులను తెలంగాణ సమగ్ర శిక్ష మంజూరు చేసింది. నవంబర్ నుంచి వచ్చే మార్చి నెలల మధ్య 3 నెలల పాటు ఈ శిక్షణ నిర్వహిస్తారు.