VIDEO: 'నిషేధిత స్థలంలో అక్రమ కట్టడం తొలగించాలి'
MNCL: బెల్లంపల్లిలో 31వ వార్డు పద్మశాలి భవన్ వెనకాల గతంలో ప్రమాదవశాత్తు కుంగిపోయి డేంజర్ బోర్డు ఏర్పాటు చేసిన స్థలంలో అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని బస్తీ వాసులు ఆరోపిస్తున్నారు. ప్రమాదకరమైన స్థలంలో అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని బస్తీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ కట్టడాల వల్ల భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.