పన్నుల వసూళ్లకు ప్రత్యేక చర్యలు
PLD: 2025-26 ఆర్థిక సంవత్సరం ఈ నెల 31తో ముగియనున్న నేపథ్యంలో మాచర్ల పురపాలక సంఘం పన్నుల వసూళ్లను ముమ్మరం చేసింది. ఇంటి పన్నులు, నీటి ఛార్జీలు, ఖాళీ స్థలాల పన్నుల కోసం మార్చి 14, 15న ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ వేణుబాబు తెలిపారు. మార్చి 31 వరకు అన్ని సెలవు దినాల్లోనూ వసూళ్లు కొనసాగుతాయన్నారు.