రంగస్థల కళాకారుల పెన్షన్ పెంచాలని వినతి

రంగస్థల కళాకారుల పెన్షన్ పెంచాలని వినతి

కృష్ణా: రంగస్థల కళాకారులకు ప్రభుత్వం అందించే పెన్షన్ పెంచాలని కళాకారుడు వెంకటస్వామి కోరారు. శుక్రవారం కోడూరు మండలం డిప్యూటీ తహశీల్దార్ సౌజన్య కిరణ్మయికు ఆయన వినతి పత్రం అందజేశారు. వృద్ధాప్య కళాకారులకు వచ్చే రూ.4 వేల పెన్షన్ సరిపోవడం లేదన్నారు. ఈ పెన్షన్‌తో కుటుంబ పోషణ కష్టం అవుతుందన్నారు. పెన్షన్‌ను రూ.6 వేలకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.