అదుపు తప్పి పామాయిల్ లారీ బోల్తా

అదుపు తప్పి పామాయిల్ లారీ  బోల్తా

SRPT: గరిడేపల్లి మండలం అప్పనపేట గ్రామం వద్ద పామాయిల్ గెలలతో వెళుతున్న లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడిన ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడెం, కోదాడ ప్రధాన రహదారిపై హాలియా నుంచి ఆంధ్రప్రదేశ్ లోని అంపాపురం పామాయిల్ ఫ్యాక్టరీకి పామాయిల్ గెలలతో వెళుతున్న లారీ అప్పన్నపేట శివారులో అదుపుతప్పి బోల్తా పడినట్లు తెలిపారు.