గంభీర్‌పై మాజీ క్రికెటర్ విమర్శలు

గంభీర్‌పై మాజీ క్రికెటర్ విమర్శలు

గంభీర్ కోచింగ్‌లో భారత టెస్టు బ్యాటర్లలో అభద్రతా భావం నెలకొందని మహ్మద్ కైఫ్ విమర్శించాడు. తరచుగా జట్టులో మార్పులు చేస్తుండటం వల్ల గందరగోళం ఉందని చెప్పాడు. ముఖ్యంగా సర్ఫరాజ్ ఖాన్, సాయి సుదర్శన్‌లను జట్టు నుంచి తప్పించడం సరికాదన్నాడు. ఆటగాళ్లు తమను తాము నమ్మడం లేదని, అభద్రతతో టర్నింగ్ పిచ్‌లపై రాణించలేకపోతున్నారని వ్యాఖ్యానించాడు.