స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం..!
KDP: ఒంటిమిట్ట రామయ్య కళ్యాణం ఇవాళ వైభవంగా జరగనుంది. ఈ కళ్యాణం సందర్భంగా సీఎం చంద్రబాబు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రాష్ట్ర విభజన జరగకముందు అధికారికంగా కళ్యాణాన్ని భద్రాచలం క్షేత్రంలో నిర్వహించేవారు. ఆ తర్వాత ఒంటిమిట్టను ఎంపిక చేశారు. 2015లో మొదటి సారి సీఎం హోదాలో చంద్రబాబు స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.