VIDEO: 'ఇళ్ల భద్రత కోసం 'LHMS' యాప్‌ వాడాలి'

VIDEO: 'ఇళ్ల భద్రత కోసం 'LHMS' యాప్‌ వాడాలి'

కోనసీమ: రాయవరం ఎస్సై సురేశ్ బాబు ప్రజలకు కీలక సూచనలు చేశారు. వేసవి సెలవుల్లో ఊర్లకు వెళ్లేవారు ఇళ్ల భద్రత కోసం 'LHMS' యాప్‌ను వాడాలని కోరారు. విలువైన వస్తువులు బ్యాంకు లాకర్లలో ఉంచాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలపాలన్నారు. ప్రయాణం సురక్షితంగా ఉండాలంటే పోలీసుల నిఘా వ్యవస్థను వినియోగించుకోవాలన్నారు.