'ఏపి దేశానికి డిజిటల్ ఇండియాలో మార్గదర్శకంగా నిలుస్తుంది'
VSP: ఇప్పటివరకు సిటీ ఆఫ్ డెస్టినీగా ఉన్న విశాఖ నగరం నేడు డిజిటల్ సిటీ రాజధానిగా మారనుందని ఎస్.కోట నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు వాకాడ బాబు తెలిపారు. ఈ మేరకు ఎల్.కోట మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో తెలుగు యువత ఆధ్వర్యంలో శనివారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. విశాఖ సిటీగా మారితే ఏపి దేశానికి డిజిటల్ ఇండియాలో మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు.